Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నియోజక వర్గ టీడీపీ క్లస్టర్ యూనిట్ ఇంచార్జిల సమావేశం నిర్వహణ


విశాలాంధ్ర – పార్వతీపురం:స్థానిక పార్టీ కార్యాలయంలో బుదవారం నాడు నియోజక వర్గంలోని పార్వతీపురం,సీతానగరం, బలిజిపేట మండలాలతోపాటు పార్వతీపురం పట్టణ క్లస్టర్ యూనిట్ ఇన్చార్జీలతో సమావేశంను నిర్వహించారు. ఈసమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శాసనమండలి మాజీ సభ్యులు ద్వారపురెడ్డి జగదీష్,నియోజకవర్గ పరిశీలకులు బోయిన గోవిందరాజులు, నియోజక వర్గం ఇంచార్జి, మాజీఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు పాల్గొని పార్టీబలోపేతం గూర్చి మాట్లాడారు. గతంలో మహనాడుకు కొద్దిమంది వెళ్ళడం, ఐటీడీపినిర్వహణగూర్చి తదితర అంశాలపై చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించపోవడంతో పార్టీ చేస్తున్న చాలాకార్యక్రమాలు కేంద్ర,రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నమోదు జరగడం లేదన్నారు. ఇటువంటి అంశాలను సరిచేయాలని క్లస్టర్ ఇంచార్జిలు నియోజక వర్గ ఇంచార్జికు సూచించారు. గతంలో జరిగిన పరిణామాలు పునరావృతం కాకుండా మేనెల 27,28, 29 తేదీల్లో జరగనున్న మహానాడుకు పెద్దఎత్తున తరలివెళ్ళే విధంగా నియోజకవర్గ ఇంచార్జి చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ బలోపేతం చేయడానికి అంతా కలిసికట్టుగా పనిచేద్దామని, రాష్ట్రముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును చేసేందుకు పనిచేయాలని పిలుపునిచ్చారు.రానున్న సాదారణ ఎన్నికలలో టీడీపీ విజయం ఖాయమని వారు స్పష్టంచేశారు.ఈకార్యమంలో పట్టణ అధ్యక్షుడు గుంట్రెడ్డి రవికుమార్, సీతానగరం మండల పార్టీ అధ్యక్షుడు కొల్లి తిరుపతిరావు, పట్టణ కౌన్సిలర్లు బడే గౌరునాయుడు, తాతపూడి వెంకటరావు, కోలా సరితమధుసూధనరావు, పార్టీ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, రెడ్డి శ్రీనివాసరావు, కోలాబాబు,బోను దేవీచంద్ర మౌళి, నారాయణరావు, కెంగువ సుధీర్, బంకపల్లి రవికుమార్, కోలా వెంకటరావు, సిరిపురపు భాస్కరరావు, తాన్న ప్రసాద్, గొంగాడ రామమూర్తి,  మరిశర్ల కార్తీక్ నాయుడు, శంబంగి తిరుపతిరావు, బేత లక్ష్మణరావు, మరియదాస్, జాగాన రవిశంకర్  తదితర క్లస్టర్ యూనిట్ ఇంచార్జిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img