Friday, April 19, 2024
Friday, April 19, 2024

జగనన్న ఆణిముత్యాల పట్ల అభినందనల వెల్లువ

ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు జగనన్న ఆణిముత్యాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ధర్మవరంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో ప్రతిభ కనపరిచిన నీరు గంటి లత 971/1000 మార్కులు, సీఈసీ గ్రూపులో గుజ్జల మౌనిక 902/1000 మార్కులు, బైపిసి గ్రూపులో పందెం వార్షిక 972/1000 మార్కులతో ప్రతిభ కనపరిచినట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి పేర్కొన్నారు. వీరు జగనన్న ఆణిముత్యాలకు ఎంపిక కావడం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో హెచ్ఈసి గ్రూపులో ప్రతిభ కనబరిచిన సాకే మరెన్న698/1000 మార్కులతో జగనన్న ఆణిముత్యాలకు ఎంపిక కావడం జరిగిందని ప్రిన్సిపాల్ రఘునందన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్తో పాటు ఆధ్యాపక బృందం తోటి విద్యార్థులు ఆ విద్యార్థులకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపికైన వీరికి ప్రభుత్వమే నేరుగా నగదు పారితోషకాలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img