విశాలాంధ్ర – కదిరి: పట్టణంలోని మనూస్ డాన్స్ అకాడమీ మాస్టర్ మనుష్ ను విద్యార్థులను ఎస్ ఎస్ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ డా. షేక్షావలి పూలమాలతో అభినందించారు.అనంతరం అయన మాట్లాడుతూ ప్రముఖ ఈ టీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ టీవీ షో లో మనుస్ విద్యార్థులు షరణి, హేమశ్రీ,జయ శ్రీలక్ష్మీ శాలిని చర్విత, ఆసిన్, ప్రియాంక ప్రముఖ ఢీ కొరియోగ్రాఫర్ మణికంఠ మాస్టర్ కొరియోగ్రఫీలో ప్రముఖ యాంకర్ కథక్ డాన్సర్ శిల్పా చక్రవర్తి, యమలీల, కళ్యాణ వైభోగమే టీవీ సీరియల్స్ ఫేమ్ భావనలతో కలిసి డాన్స్ చేయడం జరిగిందన్నారు.కరువు ప్రాంతానికి నిలయమైనా కదిరి ప్రాంతాన్ని కదిరి అంటే కళ – కళ అంటే కదిరి అనే నానుడిని నిజం చేస్తూ ఈ ప్రాంత విద్యార్థులని ప్రముఖ టీవీ చానల్స్ నందు ఆకాశాలిపిస్తున్నటువంటి మాస్టర్ మనోహర్ ను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు.రాబోయే కాలంలో మరింత మంది విద్యార్థులను రాష్ట్రస్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తీసుకొస్తానని కదిరి ప్రాంతానికి మంచి పేరు తీసుక రావడానికి మరింత కృషి చేస్తానని మనుష్ మాస్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.