Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

నియోజకవర్గ టిడిపి వాల్మీకి సాధికార ఫెడరేషన్ కమిటీ నియామకం

పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర – ధర్మవరం : స్థానిక టిడిపి పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గానికి సంబంధించిన వాల్మీకి సాధికార ఫెడరేషన్ కమిటీని నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రకటించారు. ఈ కమిటీలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ధర్మవరంకు చెందిన చిల్లా బొట్టు కిష్టప్ప, ఉపాధ్యక్షులుగా నాగులూరుకు చెందిన లింగప్ప, ధర్మారంకు చెందిన లోమడ గోపాల్, రాఘవంపల్లికి చెందిన మందల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా ముదుగుబ్బ మండలం భూధనం పల్లికి చెందిన కణం చంద్రాను నియమించారు. అదేవిధంగా అధికార ప్రతినిధులుగా చిన్న అచ్చం గారి రాజు, మల్కాపురం కిష్టప్ప ,మండల రామ్మోహన్, కొండన్న గారి శివయ్య,కార్యనిర్వాహక కార్యదర్శులుగా శివయ్య, సాకే రాజా, మందల శేఖర్, వెంగముని, మందల సూర్యనారాయణ, కార్యదర్శులుగా పూలకుంట్ల మహేష్, చింతమేకల శ్రీనివాసులు, మందల ధనుంజయ, సద్దల లక్ష్మీనారాయణ, దురుగల్లు రాములను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీకి సభ్యులకు పరిటాల శ్రీరామ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ మీకు ఇచ్చినవి పదవులు కాదని మీ సామాజిక వర్గములో సమస్యల పోరాటానికి ఇచ్చిన బాధ్యత అని వారు గుర్తు చేశారు. గత నాలుగేళ్లుగా వాల్మీకులకు బోయలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవుల ఆశ చూపి మోసం చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వాల్మీకుల నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img