ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్
విశాలాంధ్ర అనంతపురం : కరెంట్ మీటర్ రీడర్స్ కు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా పీస్ రేట్ ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు. అనంతపురము నగరంలో ఉన్నటువంటి మీటర్ రీడర్స్ సమావేశాన్ని శుక్రవారం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ… అనంత నగరంలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్ కు పీస్ రేట్ లెక్కన ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఓక బిల్లుకు 3.50 రూ,, ఇవ్వాల్సి ఉందన్నారు,కానీ నగరంలో 2.50 రూ,, నుండి 3 రూ,, వరకూ ఇస్తున్నారన్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కంటే నగరంలో చాలా తక్కువ ఇస్తూ కాంట్రాక్టర్లు కార్మికుల కడుపు కొడుతున్నారన్నారు. పీస్ రేట్ తక్కువ ఇస్తూ అందులో కూడా కార్మికులకు రావాల్సిన దానికంటే చాలా తక్కువ ఖాతాల్లో వేస్తున్నారన్నారు. ,కొంతమందికి ఈ పి ఎఫ్ అసలుకట్టడం లేదని ,కడుతున్న వారికి కూడా సరిగా కట్టడం లేదని పేర్కొన్నారు. నగరంలోని ఇద్దరు కాంట్రాక్టర్లు ప్రతి నెలా కార్మికుల నుండి లక్షల రుపాయలు ఆర్జిస్తున్నా అధికారులు పంట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్టర్లు ప్రవర్తన మార్చుకొని కార్మికులకు ఇవ్వాల్సినవి సక్రమంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు,
ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున,నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,నగర అధ్యక్షులు చిరంజీవి,మీటర్ రీడర్స్ జిల్లా కార్యదర్శి రాము,నాయకులు తదితరులు పాల్గొన్నారు.