Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

పురపాలక సంఘం పన్నులు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించండి

మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున

విశాలాంధ్ర – ధర్మవరం : పురపాల క సంఘమునకు చెల్లించాల్సిన అన్ని రకాల పనులను సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరం ఈనెల ఆఖరితో ముగుస్తున్నందున ఇంటి పన్నులు, నీటి పన్నులు, ఖాళీ స్థలం పనులు, ట్రేడ్ లైసెన్సులు, అడ్వర్టైజ్మెంట్ పన్నులను తాము కేటాయించిన కేంద్రాలలో డబ్బులు చెల్లించి, రసీదును పొందాలని వారు తెలిపారు. మార్చి 31 తేదీ లోపల పన్నులు చెల్లించాలని, అట్లు చెల్లించని యెడల సంవత్సరానికి 24 శాతం అపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుందని వారు తెలియజేశారు. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో బకాయిలు ఉన్నవారి కొళాయి కనెక్షన్లు తొలగించి, చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. పురపాలక సంఘము యొక్క పన్నులను ఆన్లైన్ నందు గాని, మున్సిపల్ కార్యాలయంలో, పార్థసారధి నగర్-2 సచివాలయం, ఎల్పీ సర్కిల్ నందుగల సచివాలయం, గీతా నగర్ సచివాలయము నందు చెల్లించవచ్చునని వారు తెలిపారు. కావున పట్టణ ప్రజలు సహకరించాలని వారు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img