Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

రాగి జావా విద్యార్థులకు మరింత ఆరోగ్యమును ఇస్తుంది

ఆర్డీవో తిప్పే నాయక్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున
విశాలాంధ్ర – ధర్మవరం : రాగి జావా విద్యార్థులకు మరింత ఆరోగ్యమును లభింప చేస్తుందని ఆర్డిఓ తిప్పే నాయక్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్ద లో మరో పోషక ఆహారం మంగళవారం నుండి ప్రారంభమైంది. ఇందులో భాగంగానే పట్టణంలోని సంజయ్ నగర్ లో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల హైస్కూల్లో ఆర్డీవో తిప్పే నాయక్ ప్రారంభించారు. అనంతరం ఆర్డీవో, కమిషనర్లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, విద్యార్థులకు లబ్ధి చేకూరేందుకు మంచి విద్యను అభ్యసించేందుకు ఈ రాగి జావా మరింత తోడ్పడుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం పూటే రాగి జావా ఇవ్వడం వలన చదువుకునేందుకు ఆసక్తికరంగా విద్యార్థులు ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు మేరీ వర కుమారి, ఉమాపతి, పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img