Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

వాడవాడలా కొలువుదీరిన గణనాదులు

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని చిన్నతుంబలం, కల్లుకుంట, మేకడోన, కంబలదిన్నె, జాలవాడి, హెచ్ మురవణి, కంబదహాల్, బసలదొడ్డి, చిన్నకడబూరు, పెద్దకడబూరు తదితర గ్రామాల్లో సోమవారం బొజ్జగణపయ్యలు వాడవాడలా కొలువుదీరారు. మండల కేంద్రమైన పెద్దకడబూరులో బస్టాండ్ ఆవరణంలో, కురువ కాలనీల్లో, చౌడేశ్వరి దేవి ఆలయంలో, లక్ష్మీ పేటలో, మాల వీదిలో, ఆదోని ప్రధాన రహదారిలో బొజ్జగణపయ్యలు కొలువుదీరారు. మండపాల వద్ద గణపతి బొప్పా మోరియా అంటూ భక్తులు నినాదాలు చేశారు. కొలువుదీరిన బొజ్జగణపయ్యలకు అర్చకులు శేషగిరి జోషి వేద మంత్రాలను చదివి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు గణపతులకు ప్రత్యేక వంటకాలతో నైవేద్యము సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img