Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జగనన్న కాలనీ, టి డ్కో లబ్ధి దారులకు సీపీఐ భరోసా

  • సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరు
  • సీపీఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి

విశాలాంధ్ర – శ్రీకాకుళం: జగనన్న కాలనీ, టి డ్కో గృహాల లబ్ధి దారులకు సీపీఐ నేతలు బరోసా కల్పిస్తున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకూ సీపీఐ పోరు ఆగదని, లబ్ధి దారుల పక్షాన నిలబడి పోరాడుతామని సీపీఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి లబ్ధిదారులకు భరోసా కల్పించారు. సీపీఐ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపులో బాగంగా మూడవ రోజు శుక్రవారం సీపీఐ నాయకులు శ్రీకాకుళం రూరల్ లో జగనన్న కాలనీలు సందర్శించారు. అనంతరం సింగుపు రం లోని పలువురు లబ్ధి దారులను కలిసి వారి సమస్యల ను తెలుసుకుని వారి సంతకాలను సేకరించారు. ఈ సందర్బంగా శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ లబ్ధి దారులు పడుతున్న బాధలు వర్ణనాతీతం అని, ఒక వైపు అధికారులు సమయం లోగా ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టాలి అని అంటున్నారు అని, ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు సరిపోక అప్పులు చేసి కట్టాల్సి వస్తుంది అని వాపోతున్నారు అన్నారు. ఆ ఆ కాలనీల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించ లేదని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు సరిపోవు అని కనీసం 8 లక్షలు ఖర్చు అవుతుంది అని, ప్రభుత్వం ఇసుక, సిమెంట్ ఉచితంగా ఇచ్చి రూ. 5 లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. టి డ్కో లబ్ధిదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది అని ఒక వైపు అప్పుకు వడ్డీ కట్టలేక, మరో వైపు కట్టిన ఇల్లు ఇవ్వక పోవటం తో ఆ సముదాయాలు అసాంగీక కార్యకలాపాలు కు నిలయంగా మారుతూ, పడుబడి పోతున్నాయి అన్నారు. వెంటనే ఆ గృహాలు లబ్ధి దారులకు అందించాలి అని డిమాండ్ చేశారు. పేదల సమస్య లు పరిష్కారం అయ్యే వరకూ సీపీఐ లబ్ధి దారులకు అండగా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమం లో ఏ ఐ టీ యూ సీ జిల్లా గౌరవ సలహా దారు చిక్కాల గోవిందరావు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు నిమ్మడ కృష్ణ, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు పట్టా ప్రభావతి, శ్రీకాకుళం రూరల్ మండలం సీపీఐ కార్యదర్శి ఎర్ర రమణమూర్తి, శింగుపు రం సీపీఐ శాఖ కార్యదర్శి శి మ్మ కరు వయ్య, మామిడి వలస సీపీఐ శాఖ కార్యదర్శి చిట్టి రమణ మూర్తి, మహిళా సమాఖ్య నాయకులు నీలవేణి, పెద్ద సంఖ్యలో సీపీఐ శ్రేణులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img