సీపీఐ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.గోవిందు..
విశాలాంధ్ర-గుంతకల్లు : అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా ని వైసిపి నాయకులకు సీపీఐ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.గోవిందు, సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి సవాల్ చేశారు.. బుధవారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.గోవిందు, సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి మాట్లాడుతూ…మా పార్టీ జగదీష్ మొన్న ప్రెస్ మీట్ లో లోకేష్ పాదయాత్ర స్థానికంగా ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తిని బహిరంగంగా చెప్పిందే చెప్పారని.జిల్లాలో ఎమ్మెల్యేల అవినీతిపై ధర్మవరం, రాప్తాడు నియోజికవర్గం ప్రజలు పడుతున్న బాధలన్నీ లోకేష్ దగ్గర మొరపెట్టుకుంటే అదే విషయమే చెప్పడం జరిగిందన్నారు.జరిగిన విషయాలపై మా పార్టి రాష్ట్ర నాయకుడు మాట్లాడితే గమనించకుండా మాజి చేర్మన్ రామలింగప్ప భుజాలు తట్టుకొని మా పార్టి సీపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ని ఆరోపణ చేయడం తగదన్నారు. సిపిఐ రామకిృష్ణ పై మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల వారికి శ్రమజీవులు ఉన్నంతవరకు కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా ఎగురుతూనే ఉంటావని దాన్ని ఏ పార్టీ గాని అడ్డుకోలేదని హెచ్చరించారు.ఇంటింకి స్టిక్కర్ లు అంటిస్తుంటే ప్రజలు పీకేస్తున్నారని చెప్తున్నారని జగదీష్ ని విమర్శించారు.అది నిజమే కదా అని అన్నారు. వైయస్సార్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు వేస్తుంటే ప్రజలే తీసేస్తున్నారని జరిగిందే చెప్పడం జరిగిందన్నారు. గుంతకల్లులో జరుగుతున్న అవినీతిపైన గాని ఎప్పుడైనా మాట్లాడామా అన్నారు.గుంతకల్లులో చాలా అవినీతి జరుగుతుందని పేరు చెప్పం గాని కొంతమంది వైయస్సార్ పార్టీ నాయకులు భూకబ్జాదారులుగా అయినారని అన్నారు.ధోని ముక్కల రోడ్లో ప్లాట్లను మూడు లక్షలకు, నాలుగు లక్షలకు అమ్ముకుంటూ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఫ్లాట్లను లాక్కొని అమ్ముకొని సొమ్ము చేసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు.రామలింగప్ప ఇసుక మాఫియా గురించి మాట్లాడినాడని ఇసుక మాఫియా చేయడం లేద, మట్టి మాఫియా కూడా విపరీతంగా పెరిగిపోయిందని ప్రశ్నించారు. ఇవన్నీ జరుగుతున్న గుంతకల్లు లో ఉన్న పరిశ్రమలు సిపిఐ పార్టి నుంచి పోయినాయని చెప్పారు. ఆ విషయాలు కూడా వెనక్కి తీసుకోవాలని ప్రశ్నించారు. మీ ప్రభుత్వంలో గత నాలుగు సంవత్సరాల నుండి కియా కార్ల పరిశ్రమ అనుబంధ సంస్థలైన దాదాపుగా ఉన్నటువంటి సంస్థలు వైసిపి నాయకులకు భయపడి ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని ప్రశ్నించారు.ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. జాకీ పరిశ్రమ రాప్తాడు నియోజకవర్గం లో కాంపౌండ్ వాల్ కట్టి దాదాపు 3000 మందికి ఉపాధి కల్పించే పారిశ్రామను గత ప్రభుత్వం పూనుకుంటే మీ పార్టీ వాళ్లే లంచాలు అడిగి బెదిరించి వెనక్కి పంపించిన వారు మీ పార్టీ వారు కాదని ప్రశ్నించారు. పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది దాంట్లో ప్రధానమైన వారు మీ పార్టీ వారే అని ప్రశ్నించారు.అమర్ రాజ సంస్థ చిత్తూరు జిల్లాలో కొన్ని వేల మంది ఉద్యోగాలు ఇస్తున్న ఫ్యాక్టరీ అలాంటి ఫ్యాక్టరీవారిని వైసీపీ నాయకులు బెదిరించి తెలంగాణ రాష్ట్రానికి తరలిపోయే విధంగా చేసింది మీరు కాదని ప్రశ్నించారు. ఇవన్నీ తెలుసుకోకుండా లోకేష్ పాదయాత్ర విషయంపై మాట్లాడినందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడిన ప్రజా సమస్యల పైన ఖండించేది సిపిఐ పార్టీ అని తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నాం మీరు తప్పుని స్వీకరించి తప్పులు సరిదిద్దుకొని మేము చేస్తీన్న ఆరోపణల పైన నిజా నిజాలు తెలుసుకొని మీరు కరెక్టుగా ఉండాలని ప్రశ్నించారు.తప్పులు మీరు చేసి మాపైన నిందలు వేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. రాష్ట్ర లో పూర్తిగా జరుగుతున్న అవినీతిలో ఇసుక మాఫియా గాని ,మద్యం మాఫియా గాని,మట్టి మాఫియా గాని మీ పార్టీ వాళ్లు చేస్తున్నారని వీటన్నిటిపై రాష్ట్రంలోని సిపిఐ పార్టీ ఖండిస్తూనే ఉందని ప్రశ్నించారు.గత ప్రభుత్వం తాహసిల్దార్ వనజాక్షి ఇసుక దానిపై మాట్లాడారు. తెలుగుదేశం ఎమ్మెల్యే చింతలేని ప్రభాకర్ దాడి చేస్తే మా రాష్ట్ర పార్టి అప్పుడే ఖండించిందని మీరు ఆ పేపర్ తేది చూసుకొని తెలుసుకోవాలని అన్నారు. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రజా వ్యతిరేకతకు పాల్పడితే మా పార్టీ నిరంతరం ఖండిస్తాదని హెచ్చారించారు. ప్రజా ఉద్యమాలపైనే మా పార్టి ఉంటుందని తెలిపారు.మీ పార్టీ వచ్చిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు సైకిల్ కూడా లేని వాళ్ళు ఈ రోజు ఇనోవా కారులో తిరుగుతున్నారని రెండు మూడు కోట్ల బిల్డింగు కట్టిస్తున్నారని ఇంత జరుగుతున్నా గుంతకల్లులో ఏరోజైనా ప్రశ్నించామని తెలిపారు.అది నిజం కాదా అని ప్రశ్నించారు. వైయస్సార్ పార్టీ నాయకులు ఇదే అవినీతి పని మీదే ఉన్నారని సొంత బిల్డింగులు కట్టుకునేందుకు,లక్షల లక్షలు విలువగల వాహనాల్లో తిరిగేందుకు అవినీతి కి పాల్పడుతున్నారని అన్నారు. మా రాష్ట్ర పార్టీ జగదీష్ ని తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అని అంటారా … మీరు మీరు అనేదాంట్లో కోట్ల కుంభకోణం జరిగిందని దానిపైన కూడా తీవ్రంగా ఖండించినమని ధర్నాలు చేసినామని అన్నారు. ఏ పార్టీలకి మేము తొత్తులు కాదు ఏ పార్టీకి మేము ఏజెంట్లు కాదు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేక ఉద్యమాలు చేసేందుకు కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని దాన్ని మీరు గుర్తించి నిజా నిజాలు తెలుసుకొని భవిష్యత్తులో మాట్లాడాలని గీతాఉపదేశం చెశారు. అనవసరంగా మాట్లాడితే మేము కూడా రంగంలోకి దిగి మీ అవినీతి పైన బహిరంగ చర్చకు పిలిచేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు.భవిష్యత్తులో పొరపాటున ఇలాంటి మాటలు మాట్లాడకూడదని వైయస్సార్ పార్టీ వాళ్లకు హెచ్చరించారు.
ఈ సందర్బంగా వీరభద్ర స్వామి మాట్లాడుతూ… ఏపీ రాష్ట్రంలో నవరత్నాలు తప్ప రోడ్లు గాని కాలువ గాని సర్పంచులకు నిధులు గాని ఇలా అనేకమైన సమస్యలు ఉన్నాయని అన్నారు.అందుకోసమే మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు.అదేవిధంగా సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లు మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలేనని స్వయాన ఒక మినిస్టర్ బహిరంగ సభల్లో చెప్పారని తెలిపారు.ఈ పథకాలు సిపిఐ కుటుంబాలకు చేరటం లేదా అని విమర్శించారు.సిపిఐ పార్టీ కుటుంబానికి వాళ్లలో ఉన్న ఓటర్స్ లకు అర్హులు అయితే ఆ పథకాలు అందుతాయి ఏదో స్వయానా వైయస్సార్ పార్టీ నాయకులు జేబులో నుండి ఇస్తున్నట్టుగా మాట్లాడీతున్నారని ఇది చాలా సిగ్గుచేటని విమర్వించారు.గుంతకల్లులో పారిశ్రమల విషయానికొస్తే స్పిన్నింగ్ మిల్లు, స్లీపర్ ఫ్యాక్టరీ, సబ్బుల ఫ్యాక్టరీ మొదలగు పరిశ్రమలు సిపిఐ పార్టీ నుండే మూతపడ్డాయని వీటి పైన నేను స్లీపర్ ఫ్యాక్టరీ వర్కర్ గా 1986 నుండి మూతపడేంతవరకు పనిచేశానని ఆ సందర్భంలో సబ్బుల ఫ్యాక్టరీ మూతపడిన స్పిన్నింగ్ మిల్లు వీటన్నిటి విషయాలపైన ఒక కార్మిక నాయకుడిగా నాకు అవగాహన ఉందని వీటి పైన ఏ రోజైనా సరే బహిరంగ చర్చలకి నేను సిద్ధమని అన్నారు. మరి వీటితోపాటు భారత రాజ్యాంగాన్ని లెక్కించినటువంటి అంబేద్కర్ కార్మికుల గురించి కూడా వారి సంక్షేమాన్ని గురించి రాశాడని అన్నారు. పరిపాలనలో కార్మికుల కోసం కార్మిక శాఖ మినిస్టర్లను ఏర్పాటు చేశాడని ఆ శాఖలో దినసరి వేతనాలను బట్టి ఆ పరిస్థితిని బట్టి కనీస వేతనం ప్రకటిస్తారు. అదేవిధంగా కనీస వేతనం కూడా కార్మికులకు రావలసిన హక్కులను కూడా ఆ శాఖలో లిఖించబడిందని తెలిపారు. సిపిఐ ఎర్రజెండాగా ఆ కోర్కెలు తీర్చమని అనేక ఉద్యమాలు చేస్తున్నామని ఆ విధంగా అడిగితే కూడా కొన్ని కారణాలవల్ల పారిశ్రమలు మూతపడితే సిపిఐ ఎర్ర జెండా మీద రుద్దడం సరైంది కాదని హెచ్చరించారు. ఈరోజు మీ పార్టీకి సంబంధించిన వైయస్సార్ కార్మిక సంఘం వీటిపైనే కొట్లాడుతుందని కార్మిక హక్కుల గురించే పోరాడుతుందని అన్నారు. పదివేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంన్నామని కాని అదనంగా డిమాండ్ చేస్తుంటే తప్పే అన్నారు.మేం కనీస వేతనం చట్టం ఏదైతే ప్రకటించిందో వాటినే డిమాండ్ చేస్తూ కోరుతున్నామని అధికంగా కోరడం లేదని అన్నారు. ఇది మీరు గమనించాలని వేతనాలు అడగమడే తప్ప లేకుంటే నేరమా అని ప్రశ్నించారు. కార్మికుల పైన అంత ప్రేమ ఉంటే ఈరోజు వాసవి ఫ్యాక్టరీలో రోజుకు అక్కడున్న కాఫీ పొడి ఫ్యాక్టరీ కూడా 10 గంటల నుండి 12 గంటల వరకు పని చేయించుకుంటున్నారని మీకు చేతనైతే మీరు అక్కడ ఎనిమిది గంటలసేపు పని చేయించగలరని ప్రశ్నించారు. పోనీ ఎన్ని గంటల పని దినాలు ఉండాలని ఏ పత్రికలలోనైనా ప్రకటన ఇచ్చారా అని ప్రశ్నించారు.కార్మిక సమస్యల పైన అనేక ఉద్యమాలు చేశామని ఆ యాజమాన్యం కార్మిక ఐక్యతను చీల్చేసిందని అన్నారు. దీన్ని మీరు కూడా గమనించి ఎనిమిది గంటలు పనిని చేయించే విధంగా మీ పార్టీ కూడా కార్మిక పక్షపార్టీగా అనిపించుకోండని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్, సిపిఐ మండల పట్టణ సహాయ కార్యదర్శులు ఎస్ఎండి గౌస్, రామాంజనేయులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.