Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించు కొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య

విశాలాంధ్ర, కదిరి.పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ,పట్టుబద్రల  ఎమ్మెల్సీ ఎన్నికల నేపద్యంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఓటును వినియోగించు కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద దొంగ ఓట్లను రానివ్వకుండా అప్రమత్తంగా వ్యవహరించారు.పట్టణ ప్రాంతం లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సరళిని పరిశీలించారు. అన్నివర్గాల సమస్యలపై తమ వాణిని వినిపించే పిడిఎఫ్ అభ్యర్థులు కత్తి నరసింహా రెడ్డి పోతుల నాగరాజు లను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.ఉపాధ్యాయ  ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి ఉపాధ్యాయుల సమస్యలపై గతంలోనే అనేక మార్లు శాసన మండలిలో ప్రజా వాణిని వినిపించాడని గుర్తు చేశారు.ఉపాధ్యాయులు,పట్టుబద్రులు, మేధావులు రాష్ట్రంలో నియంత పాలనకు వ్యతిరేకంగా పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు పలకాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img