Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

సిపిఐ నాయకులు అరెస్ట్..

విశాలాంధ్ర-తాడిపత్రి: కళ్యాణ్ దుర్గం సీఎం పర్యటన సందర్భంగా సీఎంకు వినతి పత్రిక ఇవ్వడానికి వెళ్తున్న సిపిఐ మండల కార్యదర్శి నాగరంగయ్య, బంజారా గిరిజన సమైక్య నియోజకవర్గ అధ్యక్షుడు రాంబాబు నాయక్ లను తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలియ జేయడానికి వెళ్లే నాయకుల అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని నోరు మూయించడమేనన్నారు. సిపిఐ పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు నెరవేర్చడానికి ప్రభుత్వంతో నిత్యం పోరాడుతూనే ఉంటుందన్నారు. అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img