Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

రాష్ట్ర చేనేత నాయకుడు జింకా చలపతిని పరామర్శించిన సిపిఐ నాయకులు

విశాలాంధ్ర – ధర్మవరం : ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి ఇటీవల అనారోగ్యం కు గురై, తిరుపతిలోని కిమ్స్ ఆస్పత్రిలో వైద్య చికిత్సలను అందుకొని, ధర్మవరం పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు. కాటమయ్య ,నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, జిల్లా కార్యవర్గ సభ్యులు మహదేవ్,కుళ్లాయప్పలు పరామర్శించారు. ఈ సందర్భంగా జింకా చలపతి యొక్క ఆరోగ్య విషయాలను తెలుసుకొని, ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడుకోవాలని వారు తెలిపారు. గత కొన్ని రోజుల కిందట ధర్మవరం పట్టణంలో చేనేత పరిశ్రమ కుంటుపడడంతో, నిరంతర పోరాటాలు సలిపి, చేనేత కార్మికులను ఏక దాటిగా నడిపిస్తూ, ప్రభుత్వ అధికారులలో చలనం తీసుకొచ్చారు. సమస్య పరిష్కారం అయ్యే దిశలో జింక చలపతి అనారోగ్యానికి గురి కావడం బాధాకరమని వారు తెలిపారు. ఏది ఏమైనా జింకా చలపతికి పార్టీపరంగా తమ అండదండలను కల్పిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img