Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పై అవగాహన కల్పించండి

జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి డాక్టర్ కృష్ణయ్య
విశాలాంధ్ర – ధర్మవరం : రాష్ట్రంలో అమలు అవుతున్న హెల్త్ ప్రోగ్రాములను వైద్య సేవలను ప్రజలకు విధిగా అందించాలని, ఎండాకాలంలో తట్టు వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని శ్రీ సత్యసాయి జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి డాక్టర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని సాయి నగర్ దుర్గా నగర్ లలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తదుపరి రోగులకు అందజేస్తున్న వివిధ సేవలపై వారు ఆరా తీశారు. ప్రజలందరికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరియైన నాణ్యమైన వైద్యమును అందించేటట్లు డాక్టర్లు సిబ్బంది చర్యలు తప్పక తీసుకోవాలని సూచించారు. ఎక్కడా ఎటువంటి ఫిర్యాదులు ప్రజల నుండి వస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఎండాకాలంలో నేడు ఎండ తీవ్రత ఉందని ప్రజలందరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావాలని, మిగతా సమయాలలో ఇండ్లలోనే ఉండాలని వారు తెలియజేశారు. అదేవిధంగా తట్టు విషయంలో వైద్యుల సలహాలను తప్పక పాటించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img