Monday, September 25, 2023
Monday, September 25, 2023

ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టండి

ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజా
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం వారు చేస్తున్న ఫీజుల దోపిడీలు అరికట్టి, వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య ,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజా, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు జగదీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక ఎంఈఓ. గోపాల్ నాయక్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో ఉన్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారు ప్రభుత్వా నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారంగా ఫీజుల దోపిడి చేస్తున్నారనీ ,వారి యొక్క పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నాయని మండిపడ్డారు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా, లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని వారు తెలిపారు. కాబట్టి వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ నిబంధనలు పాటించని ధర్మవరం పట్టణంలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోని, పేద,మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల భారాన్ని తగ్గించగలరని వారు కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, వామపక్ష ,అఖిలపక్ష యువజన రాజకీయ ప్రజా సంఘాలుగా కోరడం జరిగిందన్నారు.లేని పక్షాన విద్యార్థి యువజన సంఘాలన్నీ ఏకమై విద్యాశాఖ అధికారుల కార్యాలయాలకు ముట్టడి పిలుపునిస్తామనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు సాయికిరణ్, నందకిషోర్, మురళి, యాసీన్ త
దితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img