Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ…

ఎన్ ఎస్ ఎస్ క్వాలిటీర్లు. ప్రిన్సిపాల్
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని గుట్ట కింద పల్లెలో గల కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రపంచ సైకిల్ దినోత్సవంను శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఁప్రపంచ సైకిల్ దినోత్సవంఁ పురస్కరించుకొని, పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రభాకర్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం 2018 జూన్ మూడవ తారీఖున మొదటగా ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరపాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సైకిల్ యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం జరిగిందన్నారు. సైకిల్ వాడకం వలన వ్యక్తిగత ఆరోగ్యము, సమాజంలో మంచి సంబంధము, పర్యావరణాన్ని పరిరక్షించే వారిగా ఉండి, ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలని, ఎంతోమంది మేధావులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారని వారు గుర్తు చేశారు. ప్రపంచంలోను, భారతదేశంలోనూ పత్రికలు, పాలు, వివిధ వృత్తుల వారికి, కేంద్ర విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలోనూ, అంతర్జాతీయ సమాజం అభివృద్ధి కావడానికి సైకిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి కుటుంబంలో ఒక సైకిల్ ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు చిట్టెమ్మ, స మీఉల్లా,పావని, భువనేశ్వరి, రామ్మోహన్ రెడ్డి, ఆనందు, గౌతమి, పుష్పావతి, వై. స్వామి, తదితర అధ్యాపకేతర బృందము, ఎన్ఎస్ఎస్. విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img