Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

దళితులలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత పై హర్షం

పెనుకొండ పట్టణమునందు బుధవారం అంబేద్కర్ కూడలి నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దళిత సంఘాల నాయకులు దళితులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం పై దళిత సంఘాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. శాసనమండలికి దళిత అభ్యర్థులను మాల, మాదిగ లకు స్థానము కల్పించినారు దానికి మేము సీఎం జగన్మోహన్ రెడ్డి కి మా దళిత సోదరులందరూ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారికి సహకరించిన శాసన సభ్యులందరికీ పెనుకొండ ఎమ్మెల్యే మాల గుండ్ల శంకర్ నారాయణకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాబోయే ఎన్నికల్లో 2024 లో మీ నాయకత్వాన్ని సమర్థిస్తూ శాసనసభ అభ్యర్థులందరి విజయానికి పాటుపడతామని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img