విశాలాంధ్ర – వలేటివారిపాలెం : దేశంలో ఎక్కడా లేని విధంగా వైయస్సార్ చేపట్టిన అనేక సంక్షేమపథకాలు ప్రజల గుండెల్లో దేవుడిలా చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసి మరణం లేని మహానేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలిచారని ఎంపీపీ పొనుగోటి మౌనిక,మండలమీడియా అధికారప్రతినిధి పరిటాల వీరాస్వామి,ఎంపీటీసీ సభ్యులు చింతపూడి రవీంద్ర,ఇరుపని అంజయ్య,కాకు వెంకటస్వామి,డేగా వెంకటేశ్వర్లు,శివరామి రెడ్డి,తదితరులు అన్నారు.శనివారం మండలంలోని 21గ్రామ పంచాయతీ లలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్దంతి వేడుకలనుఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా మండలకేంద్రం అయిన వలేటివారిపాలెం వైయస్సార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైయస్సార్ 14వ వర్దంతి కార్యక్రమంలో ఎంపీపీ పొనుగోటి మౌనిక,ఎంపీటీసీ సభ్యులు చింతలపూడి రవీంద్ర,సర్పంచ్ లు ఇరుపని సతీష్,డేగా వెంకటేశ్వర్లు,చెన్నెబోయిన ఓబులుకొండయ్య,వింజం వెంకటేశ్వర్లు,మండలమీడియా అధికారప్రతినిధి పరిటాల వీరాస్వామి,మండలజేసీఎస్ కన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు,వైసీపీ సీనియర్ నాయకులు ఇంటూరి హరిబాబు,కాకు వెంకటస్వామి,ఇరుపని అంజయ్య,నాగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి,కుంబాల క్రాంతి,గుత్తా గోపి,రాధాకృష్ణ,ప్రగడ వెంకటేశ్వర్లు, మండలంలోని వై సీ పీ నాయకులు వై యస్ ఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మిఠాయిలు పంచి పెట్టారు.ఈ సందర్బంగా వారుమాట్లాడుతూ సంక్షేమ పథకాలు అంటే గుర్తుకు వచ్చేది వై యస్ రాజశేఖర్ రెడ్డి అని,బడుగు బలహీన వర్గాలకు గూడు నిచ్చి (ఇందిరమ్మ ఇళ్ల )పింఛను తో ఆకలితీర్చి ఆరోగ్యశ్రీ తో ఎందరికో పునర్జన్మ అందించారని అన్నారు. అందుకే ప్రజల హితంకోరిన వై యస్ రాజశేఖర్ రెడ్డి మహానేత అయ్యారని అన్నారు.