విశాలాంధ్ర. నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ చిత్ర కళాకారుడు దేశెట్టి శ్రీనివాసులు జాతీయ బంగారు నంది అవార్డుకు ఎంపిక అయినట్లు బుధవారం ఆయన విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ జి సి ఎస్ వల్లూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన చిత్రలేఖనంలో ఉత్తమ ప్రతిభా కనబరిచి నేను వేసిన చిత్రము బంగారు నంది అవార్డుకు ఎంపిక అయినట్లు తెలిపారు. ఈ అవార్డును ఈ నెల 17వ తేదీ హైదరాబాద్ రవీంద్రభారతిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్, వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ విఆర్ శ్రీనివాసరాజు చేతుల మీదుగా బహుమతి ప్రధానం ఉంటుందన్నారు. గతంలో దేశెట్టి శ్రీనివాసులుకు చిత్రలేఖనంలో 40 వరకు అవార్డులు వచ్చాయని, చిన్నారులకు 250 కి పైగా గోల్డ్, సిల్వర్ మెడల్స్ వచ్చాయన్నారు. ఇటువంటి వారిని ప్రభుత్వం వారు గుర్తించి ఇంకా పై స్థాయికి తీసుకువెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.