Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

జగన్ తోనే పేదల అభివృద్ధి

విశాలాంధ్ర, పెద్దకడబూరు :ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తోనే పేదల అభివృద్ధి సాధ్యమని వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డి అన్నారు . బుధవారం మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు. అర్హుత ఉండి పథకాలు అందకపోతే తన దృష్టికి తీసుకోరావాలని తెలిపారు. గ్రామంలో తాగునీటి, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే తనయుడు వైసీపీ యువనాయకులు ప్రదీప్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ఇందుకు స్పందించి ఆయన సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్, సొసైటీ అధ్యక్షులు రవీంద్ర, మాజీ ఎంపీటీసీ యల్లప్ప, నాయకులు గజేంద్రరెడ్డి, శివరామిరెడ్డి, పూజారి ఈరన్న, జాము మూకన్న, ముక్కరన్న, అర్లప్ప, తెలుగు చిన్న వీరేష్, కడబూరప్ప, యోహాను, లక్ష్మన్న, షాదిక్ భాష, ఏఈ లు మల్లయ్య, వేణు గోపాల్, సాయికుమార్, ఏపీవో రామన్న, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img