Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నేటి తరానికి ఆదర్శం దేవి రెడ్డి శ్రీనాథ్ రెడ్డి

ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ సంతాప సభ

శ్రీనాథ్ రెడ్డి సేవలను కొనియాడిన ప్రముఖులు
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ దేవి రెడ్డి శ్రీనాథ్ రెడ్డి భావితరాలకు ఆదర్శమని పలువురు వ్యక్తులు కొనియాడారు. అనంతపురం ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో మంగళవారం సంతాప సభను నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వికె రంగారెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. సంతాప సభలో వి కే రంగారెడ్డి మాట్లాడుతూ జర్నలిజం కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి దేవి రెడ్డి శ్రీనాథ్ రెడ్డి అని కొనియాడారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన కలం యోధుడు దేవి రెడ్డి అని గుర్తు చేశారు. రాయలసీమ అభివృద్ధికి, నీటిపారుదల రంగంలో జరిగిన పురోగతిలో శ్రీనాథ్ రెడ్డి పాత్ర మరువలేనిదని చెప్పారు. రాయలసీమ సమస్యల పైన, పేదల కష్టాల పైన ఎన్నో వార్తలు ప్రచురించి పరిష్కారానికి తోడ్పాటు అందించిన వ్యక్తి అని తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కన్వీనర్ పయ్యావుల ప్రవీణ్ మాట్లాడుతూ శ్రీనాథ్ రెడ్డి ఆశయాలను, ఆయన ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పాత్రికేయులకు మంచి చేయడానికి తనవంతు కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో మాట్లాడిన పలువురు వ్యక్తులు శ్రీనాథ్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని జర్నలిజంలో ఆయనకు ఉన్న నిబద్ధతను గుర్తు చేసుకున్నారు. సంతాప సభ లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కో కన్వీనర్లు అయుఫ్ బాషా, మంజునాథ, జిల్లా కమిటీ సభ్యులు కే పి కుమార్, ప్రదీప్ కుమార్ రెడ్డి, లోకరాజు, చౌడప్ప, చలపతి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రసూల్, ఐజేయు సభ్యులు ప్రభాకర్ నాయుడు, జర్నలిస్టులు వేణుగోపాల్, భాస్కర్ రెడ్డి, రామచంద్ర, సనప రామకృష్ణ, ఎల్. మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img