Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

నేటి నుండి భక్త మార్కండేయ స్వామి నూతన ఉత్సవ విగ్రహ పూజా మహోత్సవాలు

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మార్కెట్ వీధిలో గల శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ఈనెల 30వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు భక్త మార్కండేయ స్వామి నూతన ఉత్సవ విగ్రహ పూజా మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం కమిటీ అధ్యక్షుడు ఉపాధ్యక్షులు జక్కా చిన్న సింగరయ్య, జింక రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి జింక చిన్నప్ప, కోశాధికారి పోరాల్ల పుల్లయ్యను తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ ప్రతిరోజు ప్రధాన అర్చకులు శ్రీవత్స చే పూజలు, సేవకుడు పడిగ రాజు వెంకటేశ్వర బాబు అండ్ సన్స్ వారిచే కూడా ఉంటాయన్నారు. 30వ తేదీ ఉదయం విశ్వకేశన ఆరాధన, పుణ్యాహ వాచనం, అంకురార్పణం తదితర పూజలు, డిసెంబర్ 1వ తేదీన రక్షాబంధన పూజ, పంచగవ్య ఆరాధనం, అగ్ని మతనం, కుంభ స్థాపనం ఉక్త హోమాలు తదితరాలు, రెండవ తేదీన అగ్ని ప్రణయ నo, ఆదివాల హోమములు, నవగ్రహ గణపతి హోమములు , కలశ శోభాయాత్ర తదితరాలు, మూడవ తేదీ అగ్ని ప్రణయనం, కుంభారాదనం, విగ్రహ స్థాపనం, యాగశాల వైదిక కార్యక్రమాలు, నాలుగవ తేదీన విశ్వకేశన ఆరాధనం, మహా పూర్ణాహుతి కుంభ ప్రదక్షణం, కుంబాభిషేక, కుంభ వాహనం, అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతిరోజు శ్రీ అన్నమయ్య సేవా మండలి వారి ఆధ్వర్యంలో పోరాల్ల పుల్లయ్య, శిష్య బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img