విశాలాంధ్ర -ఉరవకొండ: అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామిని శనివారం భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయంలో ఃనెల పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామి బ్రహ్మోత్సవాలు పూర్తి అయి నెలరోజులైన సందర్భంగా నెల పూజా కార్యక్రమాలను నిర్వహించడం ఆచారంగా వస్తోంది. అందులో భాగంగా ఉదయం నుంచే స్వామివారి మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. భక్తులు కూడా స్వామి వారికి ఆకుపూజ, దాసంగాలు వంటి పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు.ఈ నెల పూజ కార్యక్రమానికి జిల్లా వాసులే కాకుండా కర్నాటక నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.