Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా నులిపురుగుల నివారణ మందు

విశాలాంధ్ర-రాప్తాడు : మండల వ్యాప్తంగా ఉన్న చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా నులిపురుగుల నివారణ మందును పంపిణీ చేస్తున్నామని ఎంపీడీఓ సాల్మన్ అన్నారు. జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా రాప్తాడు అంగన్వాడీ రెండో కేంద్రంలో మంగళవారం చిన్నారులకు డాక్టర్ శ్రావణి, జెడ్పీహెచ్ఎస్
హెచ్ఎం నర్సింహులుతో కలిసి నులిపురుగుల ( ఆల్బెండజోల్) మందును వేశారు.
చిన్నా రుల్లో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న నులిపురుగులను నివా రించి ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రాష్ర్టీయ బాలస్వస్థ కార్యక్రమంలో భాగంగా నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి చిన్నారికి ఆల్బెండజోల్‌ మాత్రను తప్పక వేయించాలని వైద్య సిబ్బందికి సూచించారు. 1 నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా, ఆరేళ్లు నిండి 19 ఏళ్లు వయస్సు గల వారికి పాఠశాలలు, కళాశాలలో మందును పంపిణీ చేయాలని ఆదేశించారు. 1 నుంచి 2 సంవత్సరాల చిన్నారులకు 200 మి.గ్రా(సగం)మాత్ర, 2 నుంచి 19 సంవత్సరాల వయస్సు వారికి 400 మి.గ్రా మాత్ర ఒక్కొక్కటి చొప్పున పంపిణీ చేసి వినియోగించేలా పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం లీలావతి, ఆశా కార్యకర్త చంద్రకళ, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, వైద్యసిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img