Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

ధర్మవరాన్ని మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్తున్నారు..

నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరాన్ని మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్తున్నారని, నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి 18వ వార్డు టిడిపి ఇన్చార్జ్ బాబ్జి పై వైసీపీ నాయకులు దాడి చేశారన్న సమాచారంతో బుధవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ పోలీసులే మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారని, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇంటి మీద పడి దాడి చేస్తారా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోరా ఏ సమాజంలో ఉన్నామని? వారు ప్రశ్నించారు. మానవ హక్కుల ఉల ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టు పెట్టారంటూ మంగళవారం రాత్రి 18వవార్డు టీడీపీ ఇన్చార్జ్ బాబ్జి పై వైసీపీ నాయకులు దాడికి యత్నించడం దారుణమన్నారు.అసలు ఏం జరిగిందన్న దానిపై వివరాలు ఆరా తీశారు. ఫేస్ బుక్ లో పోస్టులు పెడితే ఇలా ఇంటి మీదకు వచ్చి దాడులుచేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై కూడా దాడికి యత్నించడం ఏంటని ప్రశ్నించారు.? పాతికేళ్ల క్రితం ధర్మవరంలో మహిళల పై దాడులు, అరాచకాలు రాజ్యమేలుతుండేవని.. ప్రస్తుతం వైసీపీ నాయకుల చర్యలు చూస్తుంటే మళ్లీ ఆ రోజులు వస్తాయోమనన్న భయం ప్రజల్లో కల్గుతోందన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఫిర్యాదు తీసుకోకుండా రాత్రి రెండున్న వరకు కూర్చోబెట్టారని శ్రీరామ్ ఆరోపించారు. వైసీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డి ఒత్తిళ్లతో కేసు వాపసు తీసుకునేలా బెదిరించడం ఏంటని? ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు న్యాయం చేయకపోయినా ఫర్వాలేదు కానీ.. ఇలా అన్యాయంగా వ్యవహరించడం ఏంటని నిలదీశారు. మానవ హక్కుల ఉల్లంఘనలు పోలీసులే చేస్తుంటే.. ఇక ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. తమకు వ్యతిరేకంగా అభ్యంతరకర రీతిలో పోస్టులు పెట్టిన వారిపై ఇలాగే చర్యలుతీసుకుంటారా? అని పోలీసులను ప్రశ్నించారు. దీనిపై కంప్లైంట్ రిజిస్టర్ చేసి దాడికి యత్నించినవారిపై చర్యలు తీసుకోకపోతే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని శ్రీరామ్ అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామన్నారు.. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img