Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

మానవత్వం చాటుకున్న ధర్మవరం కృష్ణాపురం జమీర్

.విశాలాంధ్ర – ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కృష్ణాపురం జమీర్, పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు 10వ వార్డులో నబిరసూల్ కుట్టు మిషన్ వాటి పరికరాలను పంపిణి గురువారం పదవ వార్డ్ ఇంచార్జ్ కృష్ణాపురం జమీర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జమీర్ మాట్లాడుతూ
నబిరసూల్ గత 50సంవత్సరాలుగా పోస్ట్ ఆఫీస్ పక్కన కుట్టు మిషన్ అంగడి పెట్టుకొని జీవనం సాగిస్తున్నారని,గత రెండు రోజుల క్రితం రాత్రి కుట్టు మిషన్ అంగడిని గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడం దారుణము, బాధాకరమన్నారు.అంగడిలో ఉన్న కుట్టు మిషన్లు రెండు మిషన్ పరికరాలు 400కొత్త సంచులు కాలి బూడిద అవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం
ఈ విషయం తెలుసుకున్న జమీర్ నబి రసూల్ ను కలిసి మాట్లాడి, తెలుగుదేశం పార్టీ అండగా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం కాకుండా, నబిరసూల్ కుట్టు మిషన్ తెచ్చుకోవడానికి స్థోమేత లేకపోవడంతో, కొత్త కుట్టు మిషన్, వాటి పరికరాలు విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు 10వ వార్డ్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img