Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

కమ్యూనిటీ లెవెల్ వాలంటీర్లకు ఆపద మిత్రుల శిక్షణ

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఆంధ్ర ప్రదేశ్ స్టేట్డి జాస్టర్ మేనేజ్మెంట్ ఆధారటి మరియు
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ఇ న్స్టిట్యూట్ ఆఫ్రూ రల్ డెవలప్మెంట్అండ్ పంచాయతీ రాజ్
సంయుక్తంగా సత్యసాయి జిల్లా లోని కమ్యూనిటీ లెవెల్ లోని వాలంటీర్లకు
“ఆపద మిత్రుల” 12 రోజుల శిక్షణా కార్యక్రమం లో భాగంగ 4 వ రోజున ఇండియాన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ సత్యసాయి సాయి జిల్లా శాఖ పంగల్ రోడ్ లోని టి టి డి సి లో ప్రథమ చికిత్స గూర్చి శిక్షకుడు M. రాయుడు వివరించడం జరిగింది. ముఖ్యంగా గుండెపోటు వచ్చినప్పుడు ఏ విధంగా సిపిఆర్ చేయాలని డమ్మీ బొమ్మతో ప్రయోగాత్మకంగా తెలియజేయడం జరిగింది.
అదేవిధంగా యాకీడెంట్స్ జరిగినపుడు బాధితులకు ఎ విధంగా రికవరీ పొజిషన్స్ లో ఉంచి హాస్పిటల్స్ కు తలాలించాలని, వడదెబ్బ,పాము కాటు, తేలు కాటు జగినపుడు అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా బ్యాండేజస్ కట్టాలనే ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ శ్రీ సత్య సాయి జిల్లా శాఖ కార్యదర్శి జిల్లా కార్యదర్శి జి.బి విశ్వనాథ్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆపద మిత్ర ఆపద సమయాలలో విపత్తులు ప్రమాదాలు యాక్సిడెంట్లు జరిగినప్పుడు తక్షణ సహాయంగా నేర్చుకున్న శిక్షణను ప్రయోగాత్మకంగా ప్రయోగించి సకాలంలో
బాధితుల ప్రాణాలను కాపాడాలని అదేవిధంగా తెలుసుకున్న ఈ శిక్షణ ను ఇతరులకు నేర్పించి
ప్రమాదాలు జరగకుండా నివారించాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రథమ చికిత్స శిక్షకుడు రాయుడు ,డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ పి. నిర్మల్ దాస్ గారు రెడ్ క్రాస్ కోర్డినేటర్ బి. రమేష్ వాలంటీర్స్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img