Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వైఎస్ఆర్ భీమా కింద ఆర్థిక సహాయం పంపిణీ

విశాలాంధ్ర – ఆస్పరి : మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయం -1 లో బొల్లూరు మహానంది ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. ఇందు నిమిత్తమై వైఎస్ఆర్ భీమా పథకం ద్వారా మట్టి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైఎస్ఆర్ భీమా ద్వారా మంజూరైన తక్షణ సహాయం 10 వేలు రూపాయలను సర్పంచ్ మూలింటి రాధమ్మ, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, మేజర్ పంచాయితీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామాంజనేయులు చేతుల మీదుగా మృతుడి భార్య మహానందమ్మకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఒక్క కుటుంబం బాధ పడకూడదనే లక్ష్యంతో వైయస్సార్‌ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకువచ్చారన్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా నిండు నూరేళ్లు బతకాలని కోరుకునేది తమ ప్రభుత్వం అని అన్నారు. సంపాదించే వ్యక్తిని కోల్పోతే ఏ ఒక్క నిరుపేద కుటుంబం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ అధికారి శ్రీను నాయక్, వాలంటరీ గఫూర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img