విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని సిద్దయ్యగుట్టలో గల శ్రీకృష్ణ భజన మండలి వారికి, తే రు బజారులో గల దేవత కృష్ణమూర్తి, తన తల్లిదండ్రులైన దేవతా వెంకటాచలపతి, రాజ్యలక్ష్మి జ్ఞాపకార్థం 54 కేజీలు పంచలోహాలతో తయారుచేసిన శ్రీకృష్ణ విగ్రహాన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం దేవత కృష్ణమూర్తి ఇంటి నుండి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ స్వామి వారిని పల్లకి లో ఊరేగిస్తూ, శ్రీరామ భజన మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి సిద్దయ్యగుట్టలో విగ్రహాన్ని అప్పగించారు. ఈ సందర్భంగా దేవతాకిష్టమూర్తి మాట్లాడుతూ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం లక్ష రూపాయలు విలువ చేసే 54 కేజీల బరువు గల పంచలోహాలతో తయారుచేసిన శ్రీకృష్ణ విగ్రహాన్ని తాను ఇవ్వడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తొలుత తన స్వగృహంలో స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గీత సుహాసిని, దేవతా కృష్ణమూర్తి అండ్ కుటుంబం, నాగవత్స్ శ్రీనివాస్, కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు, నాగరాజు, డోలు చలపతి, సత్యమూర్తి, శ్రీవత్స, సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు.