Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

గర్భవతులకు, బాలింతలకు బ్రెడ్లు, పాలు పంపిణీ..

రోటరీ క్లబ్ అధ్యక్షులు జయ సింహా
విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం నాడు రోటరీ క్లబ్ వారు 50 మంది గర్భవతులకు, బాలింతలకు బ్రెడ్లు, పాలు బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు జయ సింహా ఉపాధ్యక్షులు, నరేందర్ రెడ్డి,సభ్యులు శివయ్య మాట్లాడుతూ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సంతోషంగా ఉందన్నారు. తల్లి యొక్క పాలే బిడ్డకు శ్రేష్టమైనదని, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందని తెలిపారు. అదేవిధంగా తల్లి, బిడ్డల పట్ల కూడా కుటుంబ సభ్యులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు. సొంత వైద్యం పనికిరాదని, అనుకూలమైన ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రాలలో గాని, ప్రభుత్వ ఆసుపత్రి లలో గాని వైద్య చికిత్సలను పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులతో పాటు సిబ్బంది హరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img