Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉచిత ట్రీట్మెంట్ కు కార్డులు పంపిణీ

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న లార్డ్ హాస్పిటల్ రూపాయి డాక్టర్ చామల అనిల్ కుమార్ రెడ్డి డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం, బిజెపి పట్టణ అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులుకు ఉచిత ట్రీట్మెంట్ గుర్తింపు కార్డు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ రూపాయి డాక్టర్ చామల అనిల్ కుమార్ రెడ్డి పట్టణంలోని భవన నిర్మాణ కార్మికులకు, టైలర్స్ కాలనీలోని ప్రకాశం మునిసిపల్ హై స్కూల్లో చదివిన ప్రస్తుతం చదువుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకు రెండు నెలల పాటు ఉచిత ట్రీట్ మెంట్ అందజేస్తారన్నారు. ఆయన చేతుల మీదుగా వాట్సప్ కోడ్ స్కాన్ మెంబర్ షిప్ కార్డ్స్ తనకు అందజేశారన్నారు.కావున పట్టణంలోని తెల్లరేషన్ కార్డ్ కలిగిన భవన నిర్మాణ కార్మికులు, ప్రకాశం మున్సిపల్ హై స్కూల్లో చదివిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img