Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ..

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం- డి కట్ట కింద పల్లి గ్రామానికి చెందిన సావిత్రమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి,బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు. ఈ సందర్భంగా శనివారం ఎమ్మెల్యే స్వగృహంలో ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 3 లక్షల 50 వేల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటాడని, దీర్ఘకాలిక వ్యాధులకు వ్యాధులకు గురైన వారిని కూడా నాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం బాధితులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img