విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలం హావలిగి గ్రామానికి చెందిన చింతల శీన అనే రైతు వ్యవసాయంలో నష్టాలు రావడంతో గత సంవత్సరం ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబానికి మంజూరైన రూ, 7 లక్షల రూపాయల సీఎం సహాయనిది చెక్కును సోమవారం ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా భాదిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ శివరాం రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో విడపనకల్ మండలం హావాలిగి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు భూమా విజయ్, నాగరాజు, తిమ్మప్ప, వెంకటేశు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.