Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

విశాలాంధ్ర- ఉరవకొండ : ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు అయిన చెక్కులను సోమవారం ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కొనకొండ్ల గ్రామంలో తన స్వగృహంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఉరవకొండ మండలం బూదగవి గ్రామానికి చెందిన బసవన గౌడ్ కు 26,వేలు విడపనకల్ కు చెందిన బోయ శీనకు 1,30 లక్షలు,కనేకల్ మండలం గెనిగెర కి చెందిన నెట్టికళ్ళప్ప గారి కిరణ్ కుమార్ రెడ్డికి లక్ష రూపాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అనారోగ్య బారిన పడి వేరు వేరు ప్రైవేటు ఆసుపత్రిలలో చికిత్స తీసుకోవడం జరిగిందని వైద్యచికిత్స కోసం వారు ఖర్చు చేసిన మొత్తములో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడం చేసుకోవడంతో సీఎం సహాయ నిధి నుండి బాధితులకు మొత్తం 2,54 లక్షలు రూపాయలు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విడపనకల్ మండల వైఎస్సార్సీపీ నాయకులు మాజీ ఎంపీపీ రమణా రెడ్డి,కరకముక్కల ఎంపీటీసీ మల్లికార్జున,రాము రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీలేఖ,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img