Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

బస్సు యాత్రను జయప్రదం చేయాలని కరపత్రాలు పంపిణీ

విశాలాంధ్ర -రాయదుర్గం: రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్ సీపీఐ ప్రచార బస్సుయాత్ర ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 8 వరకు జరిగే బస్సు యాత్రను జయప్రదం చేయాలని కరువు పత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిపిఐ తాలూకా కార్యదర్శి ఎం నాగార్జున మాట్లాడుతూ.
జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని రక్షించండి
నరేంద్ర మోడీ నుంచి దేశాన్ని కాపాడండి పాలకులు నియంతలైతే ప్రజలు బానిసలుగానే. ఉండిపోవాల్సిందే అన్నారు.రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పాలకులు ప్రజా సేవకులు అవ్వాలి దేశం సుభిక్షంగా ఉండాలంటే కార్మిక కర్షక శ్రేయస్సు మూలధారం ఎక్కడైతే ప్రజాస్వామ్యం ప్రజాక్షేమం సంక్షేమం లౌకిక తత్వం పరిడ విల్లుతాయో వ్యవసాయ పారిశ్రామిక నీటిపారుదల విద్యా వైద్య రంగాలు ప్రగతి పథంలో పయనిస్తాయో అక్కడ అభివృద్ధి పలాలు ప్రజలు ఆనందంగా ఉంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోజగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంఅధికారం చేపట్టిననాటినుండి గత నాలుగుసంవత్సరాలుగా రివర్స్ పాలన సాగుతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ పహారా మధ్య ఇంటికి పరిమితమై పాలన సాగిస్తున్న అపకీర్తి జగన్మోహన్ రెడ్డికే దప్పుతోందన్నారు.అధిక ధరలు నియంత్రించడంలో విఫలమైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన తదుపరి ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన్న సర్దుబాటు కస్టమర్ చార్జీలు తదితరులు పేర్లతో దాదాపు 50 వేల కోట్లు కరెంట్ చార్జీలు ప్రజలపై గుదిబండను మోపిందన్నారు. ఆస్తి చెత్త నీటి పనులు పెంచి ప్రజల జేబులో చిల్లు పెడుతున్నారు విద్యా వైద్య రంగాలను నిర్విజయం చేస్తున్న ఉద్యోగులకు ప్రతినెలా ఒకటవ తేదీన జీతాలు చెల్లించే పరిస్థితి లేదు 13.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉపాధ్యాయులు పెన్షనర్లకు 11వ పి.ఆర్.సి ద్వారా తీవ్రమైన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించిన కార్మిక చట్టాలను తూట్లు పొడుస్తూ కార్మికులపై కత్తికట్టింది వీటిని రాష్ట్ర ప్రజలకు తెలియజేయలని బస్సు యాత్రను ప్రారంభించడం జరిగింది అన్నారు. అనంతరం ప్రజలకు వివరించారు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరిమించుకొని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి
పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన ఎత్తుతో నీటి నిలువతో నిర్మించాలి ముందుగా నిర్వాసితులకు పరిహారం చెల్లించి పనులు ప్రారంభించాలి. అమరావతినే రాజధానిగా ఉంచి రైతుల పరిహారం చెల్లించాలి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ తో పాటు ఇతర జాతీయస్థాయి విద్యా వైద్యం సదుపాయాలు కల్పించాలి
యువజన విద్యార్థుల ఉపాధి కల్పన కొరకు నూతన పరిశ్రమలు ఏర్పాటుతోపాటు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలిగ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తృతపరచాలి 200 రోజుల పని దినాలను రోజుకు 600 రూపాయలు కూలిగా ఇవ్వాలి మహిళలు దళితులు గిరిజనులు, మైనార్టీలపై జరిగే దాడులను అరికట్టాలి
అపరబద్ర నిర్మాణాన్ని ఆపి రాయలసీమ జిల్లాలను కాపాడాలి రాయలసీమ ఉత్తరాంధ్రలో నిర్మాణంలో ఉన్న పెండింగ్లో ఉన్న అన్ని రకాల ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలంటూ ఈ డిమాండ్లతో సిపిఐ బస్సు జాతాను జయప్రదం చేయాలంటూ కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో. సీపీఐ పట్టణ కార్యదర్శి కోట్రెష్ సీపీఐ సహాయక కార్యదర్శి గురుస్వామి సీపీఐ నాయకులు నర్సింహులు తిప్పేస్వామి దుర్గన్న మనోజ్ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img