సామాజికవేత్త గడ్డం రాజగోపాల్.
విశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గ పరిధిలోని బడన్నపల్లి గ్రామంలో సోమవారం నియోజకవర్గ సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ ఆధ్వర్యంలో ఆ గ్రామంలోని గొర్రెల పెంపకపుదారులకు ఉచిత మందుల కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం అక్కడి ప్రజలు రాజగోపాల్ కి ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆ గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించలేదని మీరు నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. తదుపరి గ్రామములో వివిధ కారణాల చేత బాధపడుతున్న భయమ్మ ,ఎల్లప్ప, భరత్, నారాయన్ ను పరామర్శించి, తగిన ఆర్థిక సహాయమును కూడా అందజేశారు.