విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని ఏటిగడ్డ పాలెంలో మంగళ వారం ఆల్లా రఖా వెల్ఫేర్ కమిటీ వ్యవ స్థాపకుడు కలైగర్ మహమ్మద్ అయూబ్ భాష దాదాపు 250 మంది పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ప్రతి పేద ముస్లిం కుటుంబ సభ్యులు ఆనందంతో రంజాన్ పండుగ నిర్వహించుకోవాలని ఉద్దేశంతో తనకు ఉన్నదానిలో తోటి పేద ముస్లిం మహిళలకు దాదాపు 1000 రూపాయలు విలువచేసే రంజాన్ కిట్టు చీర, 5 కేజీల బియ్యం, వంటనూనె 1కేజీ, సేమియా 1కేజీ, 1/2కేజీ చక్కెర పంపిణీ చేశామన్నారు. అలాగే తాడిపత్రి ముర్షద్ లకు 8వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జుమ్మా, రోజా మసీదు ల హఫిసాబ్ లు సుల్తాన్ మొహిద్దిన్, ఆరీఫ్ సాహెబ్, చాంద్ బాషా సాహెబ్, కమిటీ సభ్యులు ఆయూబ్ బాషా, నజీర్ బాషా, ఎమ్ ఎస్ బాషా, ఖాజా, షాకిర్ లు పాల్గొన్నారు.