విశాలాంధ్ర – తాడిపత్రి : పట్టణంలోని గ్రానైట్ అసోసియేషన్ కార్యాలయం వద్ద గురువారం ది తాడిపత్రి గ్రానైట్ మార్బుల్ ఫ్లోరింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రానైట్ కార్మికులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రానైట్ మార్బుల్ ఫ్లోరింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హెచ్ఎండి రఫిక్ మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం కుటుంబంలో సంతోషంతో రంజాన్ పండగ జరుపుకోవాలని ఉద్దేశముతో నాలుగు సంవత్సరాల నుంచి గ్రానైట్ కార్మికులకు రంజాన్ తోఫా అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు వెంకట్ గ్రానైట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గౌస్ బేగ్ కమిటీ సభ్యులు హోటల్ హాజీ (పామిడి) ఎన్ఎస్. హుస్సేన్, కానాల హుస్సేన్, ఇంతియాజ్ పాల్గొన్నారు.