Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అర్హులైన ప్రతి రైతుకూ విత్తన పంపిణీ : ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి

విశాలాంధ్ర- రాప్తాడు : ఖరీఫ్ సీజనులో వేరుశెనగ సాగు చేసుకునేందుకు అర్హులైన ప్రతి రైతుకూ విత్తనకాయలు పంపిణీ చేస్తామని ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి తెలిపారు. సోమవారం రాప్తాడు రైతు భరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు విత్తన పంపిణీని ప్రారంభించారు. ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని 951 క్వింటాళ్ల బస్తాల కాయలు వచ్చాయని, సోమవారం రాప్తాడు, బోగినేపల్లి, హంపాపురం ఆర్బీకేల్లో పంపిణీ చేశామని వ్యవసాయ అధికారి జి.శుభకర్ తెలిపారు. వేరుశనగ ఒక క్వింటాలు పూర్తీ ధర రూ.9300 ఉండగా సబ్సిడీ రూ. 3720పోనూ రైతు వాటా రూ.5580 చెల్లించాలన్నారు. ఒక బస్తా ధర రూ.1674లుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆర్ కే సిబ్బందికి నగదు మొత్తం చెల్లించి రసీదు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్, యూత్ కన్వీనర్లు జూటూరు శేఖర్, చిట్రెడ్డి సత్తిరెడ్డి, వైస్ ఎంపీపీలు, అగ్రిబోర్డు ఛైర్మన్ కేశవరెడ్డి, మరూరు ఆది, నారాయణస్వామి, మన్నల రవికుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img