Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్

విశాలాంధ్ర – పెనుకొండ : ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు.   శుక్రవారం  పెనుకొండ పట్టణములోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,  శ్రీ సత్య సాయి జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 99 కేంద్రాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షల మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆంగ్ల పరీక్షలు రాశారు.సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన తాగునీరు సిద్ధంగా ఉంచాలని, పరీక్ష హాల్లో లైట్లు, ఫ్యాన్లు పనిచేసేలా చూడాలన్నారు. పరీక్షలను సజావుగా ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో, డిఐవిఈఓ. రఘునాథరెడ్డి. కళాశాల ప్రిన్సిపల్ బషీర్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img