Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

కుష్టువ్యాధి గ్రస్తుల (లెప్రసీ) గుర్తింపు జిల్లా సమన్వయ సమావేశం

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం :
కుష్టు వ్యాధి గ్రస్తుల ను గుర్తించే ముమ్మర కార్యక్రమము పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయము లో గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. విశ్వనాథయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నవంబర్ 15 వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ 2022 వరకు, 21 రోజులపాటు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమమును జిల్లా కలెక్టర్ ఆధ్వర్యములో నిర్వహిస్తున్నారన్నారు. కుష్టువ్యాధి గ్రస్తుల ను గుర్తించే ఈ కార్యక్రమము 31 మండలాలలో ఉన్న 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో, మరియు 26 పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో కుష్టువ్యాధి కి సంబంధించి అనుమానింపదగిన అన్ని కేసులను గుర్తించేందుకు సర్వే నిర్వహణ జరుగుతుందన్నారు
ప్రతి ఇంటిని ఆరోగ్య సిబ్బంది సందర్శిచి సర్వే నిర్వహిస్తారన్నారు. సర్వే లో భాగంగా ఆశ కార్య కర్త, ఒక స్వచ్చంద పురుష కార్యకర్త తమకు కేటాయింప బడిన ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంటిలో ఉన్న వారికీ కుష్టువ్యాధి లక్షణాలను వివరించి, వారందరిని పరీక్షించి వారిలో ఎవరినైనా వ్యాధి ఉందని సందేహిస్తే వారిని సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యాధికారితో మరోసారి పరీక్షింప చేస్తారన్నారు. వ్యాధి ఉందని నిర్ధారింప బడితే వారిలో ఉన్న వ్యాధి తీవ్రతను బట్టి 6 లేదా 12 నెలల పాటు ఉచితంగా చికిత్సను అందించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా ఇతర సంభందిత ప్రభుత్వ విభాగాల సహకారం కొరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యములో, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము నందు జిల్లా సమన్వయ కమిటీ సమావేశము నిర్వహింపబడినదన్నారు.. ఈ సందర్భంగా జిల్లా కుష్టు నివారణా అధికారి డా. అనుపమ జేమ్స్ మాట్లాడుతూ…కుష్టువ్యాధి పట్ల సమాజములో వున్న అపోహలు ఉన్నాయని కుష్టు వ్యాధి వంశపార్యపరం కాదనీ,శాపం పాపం అంతకన్నా కాదని అన్నారు. ఈ వ్యాధి ఎవరికైనా వయస్సు నిమిత్తం, లింగ భేదము లేదన్నారు. కుష్టువ్యాధి సామాన్యమైన వ్యాధి అని, మైకో బాక్టీరియం లెప్రే అను బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వస్తుందని ఎర్రని, రాగి రంగు స్పర్శ లేని మచ్చలు ఈ వ్యాధి ప్రారంభ దశలో శరీరము పై ఎక్కడయినా వస్తాయనీ అప్పుడు వాటిని కుష్టువ్యాధి లక్షణాలుగా సందేహించి డాక్టర్ దగ్గరకు వెళ్లాలని సూచించారు, అదే విధంగా చర్మము ఎర్రగా (కంది నట్లుగా). ముఖ్యంగా చెవులు, ముఖము, కాళ్లు, చేతులు మరియు శరీరము పై బుడిపెలు వుండడము వంటి లక్షణాలు,
కాళ్లు, చేతులు, ముఖము (నోటి కళ్ళ) కండరాల బలహీనత మరియు వంకరగా ఉండడం
నరములు ఉబ్బినట్టుగా ఉండి నొప్పిగా అనిపించడము వంటివి మరియు కళ్ళు సరిగా మూయ లేక పోవడం
దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవడములో ఇబ్బంది కలిగి వుండడము వంటి లక్షణాలు , ఉదా: కాలికి వేసుకున్న చెప్పులు మాటిమాటికి జారిపోవడము, పెన్ను, వంట పాత్రలు, కొడవలి,ఇతర వస్తువులు సరిగా పట్టుకోలేక పోవడము, వంట చేసే సమయములో అర చేతులకు తెలియకుండానే బొబ్బలు రావడము లేక ఎక్కువ దూరము నడచి నప్పుడు తెలియకుండానే అరికాలి ఫై బొబ్బలు రావడము ఆ బొబ్బలు. నొప్పిగాఅనిపించకుండా వుండడమువంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు.
వ్యాధి గ్రస్తుడైన చికిత్స పొందని ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి గ్రస్తుడు మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలుబడే తుంపర్ల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుందని పేర్కొన్నారు. కుటుంబములో ఒకరికి ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన కుటుంబ సబ్యులకు అందరికీ ఈ వ్యాధి రాదన్నారు. ఇతర అంటు వ్యాధులవలె కుష్టువ్యాధి వేగంగా మరొకరికి సోకదన్నారు. మనలో జన్మతహ వున్నవ్యాధి నిరోధక శక్తి వలన దాదాపు 90 శాతము మంది ఈ వ్యాధికి గురి కారని
కుష్టు వ్యాధిని బహుళ ఔషధ చికిత్సతో వ్యాధి ఏ దశ లో వున్ననూ పూర్తిగా
నయం చేయవచ్చని తెలిపారు.
వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి చికిత్స పొందడము ద్వారా అంగవైకల్యాన్ని పూర్తిగా నివారించవచ్చని అన్నారు.
ప్రతి ఆరోగ్య కేంద్రములో కుష్టువ్యాధికి చికిత్స ఉచితంగా లభిస్తుందని తెలిపారు.
ఫై విషయాలన్నీ తెలియ చేయడము ద్వారా ప్రజలలో తమంతట తామే వ్యాధిలక్షణాలను గుర్తించి చికిత్స కోసము ముందుకు వచ్చేలా అవగాహన పెంపొందించడము ముఖ్య ఉద్దేశమని అన్నారు. అనంతరం కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం పై గోడపత్రికలను విడుదల చేశారు.
ఈ సమావేశములో డి ఐ ఒ డా. యుగంధర్, డా.చెన్న కేశవులు, డా.సుజాత, చర్మ వ్యాధి నిపుణులు డా. కిషోర్ కుమార్, డా.నారాయణ స్వామి, డా. అన్వర్ భాషా, డా.శివా రెడ్డి, లలితమ్మ సీడీపీఓ , ఆర్ డి టి సిర్రెప్ప , బాబూ నెహ్రూ రెడ్డి, జిల్లా పరిషత్ ఏ ఒ శ్రీనివాసులు, విశ్వనాథ రెడ్డి,డెమో భారతి, వీరమ్మ, ఇందిర, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img