Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ఉరవకొండ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అన్బు రాజన్

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పోలీస్ స్టేషన్ ను బుధవారం అనంతపురం జిల్లా ఎస్పీఅన్బు రాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో రికార్డులను ఆయన పరిశీలించారు. కేసులు పూర్వపురాలు సంబంధిత అధికారులును అడిగి తెలుసుకున్నారు. పోలీస్ దాడులు సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లో ఎలా ఉన్నాయో పరిశీలించే కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ స్టేషన్ను కూడా పరిశీలించడం జరిగిందన్నారు. క్రైమ్ వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని పెండింగ్ లో ఉన్న కేసులను త్వరతిగతిన కోర్టుల ద్వారా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించడం జరిగిందన్నారు. రౌడీ షీటర్ల పై నిఘా పెంచాలని రౌడీ షీటర్ల పై ఉన్న కేసులను కూడా ఫాస్ట్ ట్రాక్ గా పరిష్కరించాలని సూచించడం జరిగింది అన్నారు. సీసీ కెమెరాలను కూడా పెంచాలని సమస్యలపై పోలీస్ స్టేషన్కు వచ్చే పిటీషనర్లకు సంబంధించిన సమస్యలను ఏడు రోజుల లోపల పరిష్కరించాలని అవి కూడా పిటిషనర్లు పూర్తిగా సంతృప్తి చెందేలా ఉండాలని సూచించడం జరిగింది అన్నారు. జిల్లాలో ఎక్కడైనా కూడా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే ప్రధానంగా జూదం, ఐడి లిక్కర్, పిడిఎస్ బియ్యం అక్రమ తరలింపు, బెట్టింగులు లాంటి సంఘటనలకు ఎవరు పాల్పడుతున్న 9440796800 అనే నెంబర్కు ఫోను గానీ లేదా మెసేజ్లు గాని చేస్తే అసాంఘిక కార్యక్రమాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని ఫోను చేసిన వారి యొక్క సమాచారాన్ని రహస్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ అర్బన్ సిఐ హరినాథ్, రూరల్ సీఐ శేఖర్, ఎస్సైలు తదితర సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img