London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

ఎస్సై ఉద్యోగాలు సాధించి శిక్షణ కోసం రిలీవ్ అయిన నలుగురి కానిస్టేబుళ్లను సన్మానించిన జిల్లా ఎస్పీ

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో కానిస్టేబుళ్లుగా పని చేస్తూ ఎస్సై ఉద్యోగాలు సాధించిన నలుగురు పోలీసులు రిలీవ్ అయ్యారు. ఎస్సై శిక్షణ కోసం వెళ్తున్న వీరిని జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ సన్మానించారు. వీరంతా 2018 బ్యాచ్ నకు చెందిన వారు. బుక్కరాయ సముద్రం మండలం రేగడి కొత్తూరుకు చెందిన వి.మణికంఠేశ్వరరెడ్డి ప్రస్తుతం జిల్లా పోలీస్ సైబర్ విభాగంలో కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. కర్నూలు జిల్లా రామాపురంకు చెందిన జి.సూర్య నారాయణ రెడ్డి జిల్లాలోని గుమ్మఘట్ట పోలీసు స్టేషన్లో … పెద్దపప్పూరు మండలం యక్కలూరుకు చెందిన పి.శ్రావణి గుత్తి పోలీసు స్టేషన్లో… శింగనమల మండలం నాగులగుడ్డం తాండాకు చెందిన వెంకట లక్ష్మి అనంతపురం నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. వీరంతా ఇటీవల జరిగిన ఎస్సై ఉద్యోగాల నియామకంలో ఉద్యోగాలు సాధించారు. ఎై ఉద్యోగ శిక్షణ కోసం వీరంతా జిల్లాలో చేస్తున్న విధుల నుండీ రిలీవ్ అయ్యారు. వీరందర్నీ ఈరోజు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సన్మానం చేసి మెమొంటోలు అందజేశారు. ఎస్బీ సి.ఐ జాకీర్ హుస్సేన్, సైబర్ విభాగం సి.ఐ షేక్ జాకీర్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img