విశాలాంధ్ర అనంతపురం వైద్యం : అనంతపురం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సిబ్బంది కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సమీక్షించారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల కోసం సంక్షేమ కార్యక్రమాలను ఇంకా అభివృద్ధి చేసేలా ఈ సమావేశంలో చర్చించారు. పోలీసు అధికారులు, స్పెషల్ బ్రాంచి అధికారులు మరియు పోలీసు వెల్ఫేర్ కమిటీ, అసోసియేషన్ సభ్యులతో ఎస్పీ మాట్లాడారు. ఈసమావేశంలో అదనపు ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి (పరిపాలన), ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఎస్ లక్ష్మినారాయణరెడ్డి, ఎస్బీ సి.ఐ లు జాకీర్ హుస్సేన్, ఇందిర, ఆర్ ఐ లు రాముడు, రెడ్డెప్పరెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, తేజ్ పాల్, తదితరులు పాల్గొన్నారు.