Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

గుండెపోటుతో మృతి చెందిన హోంగార్డు మృతదేహాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ

ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ క్రియలు నిర్వహించాలని సూచన
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : గుండెపోటుతో మృతి చెందిన హోంగార్డు ఎం .మారెప్ప ( హెచ్ సి నంబర్ 366) మృతదేహాన్ని జిల్లా ఎస్పీ శ్రీ కె.శ్రీనివాసరావు సందర్శించారు. కంబదూరు మండలం అండేపల్లి గ్రామానికి చెందిన ఎం .మారెప్ప రాయదుర్గం అర్బన్ పోలీసు స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్నారు. ఈయన నిన్న రాత్రి బీట్ డ్యూటీలో ఉన్నారు. రాయదుర్గం పట్టణంలోని కె.బి.ప్యాలెస్ రోడ్డులో బీట్ విధుల్లో ఉన్న ఇతనికి నిన్న అర్ధరాత్రి సమయంలో గుండెపోటు వచ్చి క్షణాలలోనే చనిపోయారు. ఎం మారెప్పకు భార్య నాగమణి, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఈయన మృతదేహాన్ని స్వగ్రామమైన అండేపల్లికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఎం.మారెప్ప మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృత దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ క్రియలు నిర్వహించాలని సూచించారు. పోలీసుశాఖ నుండీ అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా ఎస్పీతో పాటు కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, సి.ఐ లు శ్రీనివాసులు, తేజోమూర్తి, లక్ష్మణ్ , తదితరులు వెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img