మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల
విశాలాంధ్ర – ధర్మవరం : పురపాలక సంఘ కార్యాలయంలో ఈనెల 29వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశమును నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల, పురపాలక సంఘ కమిషనర్ మల్లికార్జున సోమవారం తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అజెండాలోని 76 అంశాలపై చర్చించి తీర్మానంతో ఆమోదం చేయడం జరుగుతుందని వారు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని వార్డు ల సమస్యలపై కూడా చర్చించి, పరిష్కార మార్గానికి కృషి చేయడం జరుగుతుందని వారు తెలిపారు. వేసవికాలం ప్రారంభమైనందున నీటి కొరత లేకుండా తగిన చర్యలపై కూడా చర్చించడం జరుగుతుందని వారు తెలిపారు. కావున కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.