Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

డాక్యుమెంట్ రైటర్ల నిరసన

విశాలాంధ్ర- ఉరవకొండ : ప్రజల యొక్క ఆస్తులకు సంబంధించి యాజమాన్య హక్కు పత్రాలైన డాక్యుమెంట్లు రూపకల్పన విధానాన్ని ఆన్లైన్లో ప్రభుత్వం తీసుకురావడాని నిరసిస్తూ బుధవారం ఉరవకొండ లో స్థానిక రిజిస్టర్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్లు మరియు వెండర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ల యూనియన్ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానానికి నిరసనగా రెండు రోజులపాటు తాము పెన్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ లోనే డాక్యుమెంట్ను తయారు చేసుకుని చలానా చెల్లించి టైం స్లాబ్ ఏర్పాటు చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ
గ్రామ, వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల సేల్ డీడ్డ్స్ వంటివి జరిగి ఏవైనా లోపాలు చేసుకుంటే ఆస్తులు కలిగిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఆన్లైన్ డాక్యుమెంట్ విధానం వల్ల అమ్మకు దారులను కొనుగోలు దారులను కూడా మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నారు. ఈ కొత్త విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వం డాక్యుమెంటరీ రైటర్ల కడుపు కొడుతుందని వారు ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా నూతన విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు మరియు వెండర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img