Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అధికార పార్టీ నాయకులకు ఎన్నికల కోడ్ వర్తించదా

విశాలాంధ్ర – పెనుకొండ : నగర పంచాయతీ నందు బుధవారం నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ మంగమ్మకు అభినందన సభ సన్మాన సభ ఏర్పాటు సందర్భంగా పట్టణంలో అనేక కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఫ్లెక్సీలను చూపిస్తూ అధికార పార్టీ నాయకులకు ఎలక్షన్ కోడ్ వర్తించదా పాలక పక్షానికి ఒక చట్టము ప్రతిపక్షానికి ఒక చట్టం మేము గత 20 రోజుల నుంచి అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజల బడుగు బలహీన వర్గాలు చిన్న వ్యాపారాలకు కూలి పనుల చేసుకునే వారికి కడుపు నింప అన్నము పెడుతుంటే వాటి మీద ఎన్నో ఆంక్షలు పెట్టారని అన్నము పెట్టడానికి ఎలక్షన్ కోడ్ ఉంటుందని అధికారులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికార పార్టీ నాయకులకు వారి యొక్క నాయకుల ఫోటోలను ముద్రించి ఇలా ప్లెక్సీలు వేయడం ఎంతవరకు సబబు అని కనీసం ఎన్టీఆర్ బొమ్మకు ముసుగు వేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మకు ముసుగు వేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ నూతనంగా ఎంపికైన మంగమ్మ ఫోటోలను ముద్రించి ప్రచురించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు చట్టం అందరికి ఒకేలా ఉండాలని అధికారులు నిష్పక్షపాతంగా ఉండాలని ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img