Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

రోగులకు సేవా కార్యక్రమాలు చేయడమే, దైవ సేవ అవుతుంది..

శ్రీ సత్య సాయి భజన మండలి నిర్వాహకులు.

విశాలాంధ్ర- ధర్మ వరం : రోగులకు సేవా కార్యక్రమాలు చేయడమే దైవ సేవ అవుతుందని శ్రీ సత్య సాయి భజన మండలి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అరిగెల పోతన్న హాస్పిటల్ లో పుట్టపర్తి బాబా వారి భజన కార్యక్రమం జరిగిందని శ్రీ సత్యసాయి సేవా సమితి వారు తెలిపారు. అనంతరం శ్రీ సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 200 మందికి ఉదయం పాలు, బ్రెడ్, బిస్కెట్లను ఆసుపత్రి వైద్యులు, నర్సుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ సేవా కార్యక్రమం కలవల రమాదేవి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దాతకు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే గ్రామ ప్రజలకు ఇటువంటి సేవా కార్యక్రమం ఒక వరంలాగా మారిందని, పేద రోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపా రు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి భజన మండలి వారికి ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img