Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుంది… ముఖ్యఅతిథి సిద్ధ రాజేష్

విశాలాంధ్ర- ధర్మవరం : రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందని సిద్ధ రాజేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయంలో శ్రీ చౌడేశ్వరి సేవా సమితి నిర్వాహకులు వీరే శ్రీరాములు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్యఅతిథి సిద్ధ రాజేష్ తో పాటు కౌన్సిలర్లు కేత లోకేష్, నీలూరి వెంకటరాముడు, మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వీరే శ్రీరాములు మాట్లాడుతూ రక్తదానం నేటి సమాజంలో అందరికీ అవసరం ఉన్నదని, అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయుట ను బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. ఈ రక్తదానం వల్ల ఆపదలో ఉన్నవారికి, గర్భిణీ స్త్రీలకు, తల సేమియా వ్యాధిగ్రస్తులకు ఈ రక్తదాన శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ శిబిరంలో మొత్తం 51 మంది రక్తం ఇవ్వడం జరిగిందని వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు వారు తెలియజేశారు. అంతేకాకుండా ఈ శిబిరంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాల అందించిన అందరికీ కూడా మరోసారి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి మంజు, రోటరీ క్లబ్ కార్యదర్శి నాగరాజు, ఆదర్శ సేవా పార్కు అధ్యక్షులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img